తండ్రయిన జహీర్ ఖాన్.. ఇన్ స్టా లో పోస్ట్..
మాజీ భారత క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రయ్యారు. ఆయన సతీమణి, నటి సాగరిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బుధవారం ఇన్ స్టా వేదికగా వెల్లడిస్తూ చిన్నారి ఫొటోను పంచుకున్నారు. తమ కుమారుడికి ఫతేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. సాగరిక గర్భవతిగా ఉన్న విషయాన్ని జహీర్ ఖాన్ దంపతులు ఇప్పటివరకు సీక్రెట్ గా ఉంచారు. నేడు చిన్నారి ఫొటో షేర్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ జంటకు పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

