Home Page SliderLifestylemoviesNationalVideosviral

బన్నీ బర్త్‌డే స్పెషల్ వీడియో..

బన్నీ, స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అంటూ అభిమానంగా పిలుచుకునే స్టార్ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు నేడే. ఆయన పుట్టినరోజు సందర్భంగా స్టార్ డైరక్టర్ అట్లీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న చిత్రాన్ని కన్‌ఫర్మ్ చేస్తూ సన్ నెట్‌వర్క్ అల్లు అర్జున్‌కు బర్తడే విషెస్ చెప్పింది. ఈ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పోస్టు పెట్టింది. ఈ ప్రాజెక్టు వివరాలు పంచుకుంటూ వీడియో ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది. ఈ చిత్రం సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థపై రానుంది. పుష్ప1, 2 చిత్రాలతో నేషనల్ అవార్డు అందుకుని, ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన అల్లు అర్జున్ నటించబోయే తర్వాత చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.