Home Page SliderNational

భార్యతో డాన్స్ చేస్తూ భర్త స్టేజిపైనే మృతి..

ఓ వ్యక్తి తన భార్యతో డాన్స్ చేస్తూ స్టేజి పైనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. వసీం సర్వత్(50) అనే షూ వ్యాపారి తన 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా, స్టేజీపై భార్యతో డాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో అక్కడ జరుగుతున్న వివాహ వార్షికోత్సవ వేడుకల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంతో కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు.