కమెడియన్ కునాల్ వెనుక విదేశీ హస్తం..
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై వివాదాస్పద పాటలు పాడి వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాపై శివసేన నేత సంచలన ఆరోపణలు చేశారు. విదేశాలలోని భారత వ్యతిరేక సంస్థల నుండి కునాల్ నిధులు పొందుతున్నారని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని శివసేన నేత రాహుల్ ఆరోపించారు. దేశంలోని ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్, బీజేపీ నేతలు, అగ్రనేతలు, సుధామూర్తి, ఆనంద్ మహేంద్ర వంటి విశిష్ట నాయకులపై ఇలాంటి సెటైరికల్ సాంగ్స్ పాడినందుకు కునాల్‌కు దేశ వ్యతిరేక శక్తులు, ఖలిస్థాన్ గ్రూపులు, ఉగ్రసంస్థల నుండి డబ్బులు వస్తున్నాయని పేర్కొన్నారు.

