Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,

‘నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం’..ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..

తనకు మంత్రి పదవి రావడంపై కీలక వ్యాఖ్యలు చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకు ఈ సారి మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని ఆయన మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమని పేర్కొన్నారు. కానీ ఏ మంత్రిగా చేసినా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. అధిష్టానం నిర్ణయం మేరకే పార్టీలో అందరం కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. అయితే ఏఐసీసీ మంత్రి వర్గ విస్తరణకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.