crimeHome Page SliderNationalviral

విమానంలో కుక్కకు అనుమతి లేదని హత్య..

ముద్దులొలికే తెల్లటి షనాసర్ జాతి కుక్క(9)తో కలిసి కొలంబియా వెళ్లాలని విమానం ఎక్కడానికి ఫ్లోరిడా ఎయిర్ పోర్టుకు చేరుకుంది ఒక మహిళ. అయితే కుక్కను విమానం ఎక్కించడానికి తగిన పత్రాలు లేవని విమానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నారు. దీనితో ఆమె అమానవీయంగా హత్య చేయడం సంచలనం కలిగించింది. విమానాశ్రయ టాయిలెట్‌లోని చెత్తసంచిలో కుక్క మృతదేహం దొరకడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నీటిలో ముంచి ఆ కుక్కను చంపి, కవర్‌లో పెట్టి చెత్తబుట్టలో వేసిందామె. తర్వాత చక్కగా విమానం ఎక్కి వెళ్లిపోయింది. అయితే ఆ కుక్క మెడలోని బెల్టులో ఆమె పేరు, ఫోన్ నెంబర్ ఉండడంతో ఆమెను అలిసన్ లారెన్స్(57)గా గుర్తించారు.  జంతు హింస నేరం కింద అరెస్టు చేశారు.