పాప మీద నుంచి వెళ్లిన కారు.. తర్వాత ఏమైందంటే..
హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఆడుకుంటున్న పాప మీద నుంచి ఓ కారు దూసుకెళ్లింది. వెంటనే చూసిన మరో వ్యక్తి తీవ్ర గాయాలైన పాపను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కూకట్ పల్లి వడ్డేపల్లి ఎంక్లేవ్ లో జరిగింది. అధ్రిత అనే పాప వయస్సు రెండున్నర సంవత్సరాలు. ఈ నెల 16వ తేదీన ఘటన జరిగింది. అయితే.. అధ్రిత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో అద్రిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా కంటతడి పెట్టారు. అద్రిత తల్లిదండ్రులు కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.


 
							 
							