వేగంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలు ……!
ప్రస్తుతం బంగారం మరియు వెండి ధరలు అనేక సంవత్సరాల తర్వాత ఆల్‌టైం రికార్డ్‌లకు చేరాయి. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలు ఇప్పుడు ఎగురుతున్నాయి. బంగారం ధరల పెరుగుదల, అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా రష్యా-యుద్ధవిరమణ పరిణామాల ప్రభావం వల్ల ఈ ధరలు మరింతగా పెరిగాయి. బుధవారం (మార్చి 19) ధరల విషయానికొస్తే.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.91,010 పలికింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.82,510కు చేరుకుంది. 18 క్యారెట్లు తులం రూ.67,510కు పెరిగింది. ఇక కిలో వెండి ధర వంద రూపాయలు పుంజుకుని రూ.1,04,100కు చేరుకుంది. వెండి గ్రాము ధర రూ.104.10 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం = ₹90,010 (10 గ్రాములు) , 22 క్యారెట్ల బంగారం = ₹82,510, (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం = ₹67,510 (10 గ్రాములు)కు పెరిగాయి.. ఇవే ధరలు కాకినాడ, నెల్లూరులో కూడా కొనసాగుతున్నాయి.

