Breaking NewsHome Page SliderTelangana

తెలంగాణలో 783 గ్రూప్‌ -2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

న్యూఇయర్‌ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కానుకను అందించింది. తెలంగాణలో గ్రూప్‌ -2 నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు నిచ్చింది. 783 పోస్టులతో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసింది. జనవరి 18 నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మరోవైపు గ్రూప్‌-1 ప్రిలిమినరీ ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక గ్రూప్‌-4 నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.