National

దీపావళి కానుకగా 78 రోజుల బోనస్  

కేంద్ర కేబినేట్ సమావేశమై పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. బుదవారం జరిగిన ఈ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ క్రమంలోనే 78 రోజుల బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కానీ ఈ బోనస్ ఇచ్చే విషయంలో ఒక చిన్న ట్విట్స్ ఉన్నట్టు తెలిపారు. ఈ బోనస్ అందరికి ఇవ్వకుండా కేవలం పర్ఫామెన్స్ ఆధారితంగానే దీనిని ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. మొత్తం 11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులు గరిష్టంగా రూ.17,951 పొందుతారని వివరించారు. కాగా నాన్ గెజినెట్ రైల్వే ఉద్యోగులకు పర్ఫామెన్స్ ఆధారిత ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్టు కేంద్రం ఇది వరకే తెలిపింది. అంతేకాక ఆయిల్ సంస్థలకు రూ.22వేల గ్రాంట్ , మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్లు -2022కి కూడా ఈ సమావేశంలో కేంద్రం ఆమోదం తెలిపిందని ఠాకూర్ వెల్లడించారు.