దేశంలో 5 జీ సేవలు ఆరంభం
దేశంలో 5 జీ నెట్ వర్క్ సేవలను ప్రధాని నరేంద్రమోదీ ఘనంగా ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 5జీ సేవలను మోదీ లాంచ్ చేశారు. దేశ వ్యాప్తంగా 13 నగరాల్లో 5 జీ సేవలు అందుబాటులోకి రానున్నాయ్. 5జీని కష్టమర్లకు అందించేందుకు టెలికామ్ కంపెనీలు సిద్ధమవుతున్నాయ్. ఇంటర్నెట్ వేగం ముందెన్నడూ లేని వేగంగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు దేశ ప్రజలకు 5 జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. డిజిటల్ ఇండియా లక్ష్యం దిశగా మరో అడుగు ఇవాళ పడింది. 5జీ నెట్ వర్క్ హైదరాబాద్‌లో సైతం అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.

