పశ్చిమ బెంగాల్ లో 58,20,898 ఓట్లు తొలగింపు
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మంగళవారం విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితా లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. 2026 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా వివిధ కారణాలతో ఏకంగా 58,20,898 మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో మరణించిన వారు 24.16 లక్షలు, వలస వెళ్లిన వారు 19.88 లక్షలు, అదృశ్యమైన వారు 12.20 లక్షల మంది ఉండగా, మరో 1.38 లక్షల నకిలీ ఓట్లను కూడా గుర్తించి తొలగించారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు లేదా క్లెయిమ్‌లు ఉంటే జనవరి 15 లోపు డిక్లరేషన్ ఫారమ్స్ సమర్పించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఆ గడువు ముగిసిన తర్వాతే తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

