బాన్సువాడలో 56.90 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం
నకిలీ నోట్లు తయారీ చేస్తున్న దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 8 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ సింధుశర్మ తెలిపారు. ఇవాళ మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టుబడ్డవారిలో తెలంగాణతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నారన్నారు. నిందితుల నుంచి రూ. 56.90 లక్షల 500 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కంప్యూటర్, కలర్ ప్రింటర్, కలర్స్, రిబ్బన్, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

