చై.నా.లో రూ.5కోట్లు స్వాధీనం
చైతన్య నారాయణ విద్యాసంస్థల్లో ఐటి తనిఖీలు చేపడుతున్న అధికారులకు ఒక్క రోజే హైద్రాబాద్ బ్రాంచ్‌లో రూ.5కోట్లు లభించాయి.వాటిని సీజ్ చేశారు.దేశవ్యాప్తంగా ఏపి ,తెలంగాణ సహా మొత్తం 10 చోట్ల నారాయణ,చైతన్య విద్యాసంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మిగిలిన 9చోట్ల ఎంత స్వాధీనం చేసుకున్నారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు.అడ్మిషన్లు,ట్యూషన్ ఫీజల రూపంలో ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు యాజమాన్యం తెలిపింది. అన్నీ బ్రాంచ్ ఆఫీసుల్లో రికార్డులను పరిశీలిస్తున్నారు.

