పోలింగ్‌కు 400 రోజులే మిగిలి ఉంది… ఓటర్ల దగ్గరకు వెళ్లండి…
లోక్ సభ ఎన్నికలకు మనకు 400 రోజులు మాత్రమే ఉన్నాయని… ప్రజలకు సేవ చేయడానికి కదలాలంటూ ప్రధాని మోదీ బీజేపీ నేతలకు హితబోధ చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం ద్వారా చరిత్ర సృష్టించాలి మోదీ చెప్పారని… మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. ఈరోజు జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల గురించి మోదీ ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. నేతలంతా బేషజాలు మాని… ఓటర్లకు చేరువ కావాలన్నారు. 18-25 ఏళ్ల మధ్య వయస్సు ఓటరుపై దృష్టి పెట్టాలని మోదీ కోరినట్టు ఫడ్నవీస్ తెలిపారు. చరిత్ర, గత ప్రభుత్వాలు ఏమి చేశాయో వారికి తెలియదని… దేశం గురించి వారికి అవగాహన కల్పించాలని మోదీ సూచించారన్నారు. ప్రజాస్వామ్య మార్గాలను వారికి పరిచయం చేయాలన్నారని… సుపరిపాలనలో భాగం కావడానికి వారికి సహాయపడాలని కోరారన్నారు.


