Andhra PradeshHome Page Slider

వివేక హత్యకు 4 కారణాలు… కోర్టులో లాయర్ ఆర్గ్యుమెంట్

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకు 4 కారణాలు కారణమంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి లాయర్ చెప్పారు. వివేక హత్య కేసులో సంచలనాలు నమోదవుతున్న తరుణంలో తనను అరెస్టు చేయకుండా బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్ తెలంగాణ హైకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో అవినాష్ లాయర్ వివేక హత్యకు దారితీసిన అంశాలపై క్లారిటీ ఇచ్చారు. కుటుంబంలో అంతర్గత సమస్యలు, వ్యాపార సంబంధాలు, వివాహేతర సంబంధాలు, పొలిటికల్ లబ్ధి కోసం హత్య జరిగి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ అవినాష్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీబీఐ విచారణ తీరు చూస్తుంటే కేసులో అవినాష్, భాస్కర్ రెడ్డిని ఇరికించాలని ప్రయత్నం జరుగుతోందని కోర్టుకు వివరించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. హైకోర్టు విచారణ పూర్తయ్యాక మాత్రమే అవినాష్‌ను విచారణకు పిలవాలని ఆదేశించింది. కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని చిత్రహింసలకు గురిచేయడంతో సీబీఐకి భయపడి తనపైనా, భాస్కర్ రెడ్డిపైనా వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారని అవినాష్ రెడ్డి చెబుతున్నారు.