3వేల మంది ఫోటోగ్రాఫర్లు….మంత్రి రోజా అరుదైన రికార్డ్
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఎక్కడున్నా సెష్పల్ ఎట్రాక్షనే. రోజా ఎక్కడుంటే అక్కడ సందడి నెలకొంటుంది. ఎమ్యెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చిరునవ్వుతో అందరిని ఆప్యాయంగా పలుకరిస్తూ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. మంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఆమె పాల్గొనే కార్యక్రమాలకు మరింత ఆకర్షణగా నిలుస్తున్నారు. రోజా ఎక్కడ ఉంటే అక్కడ ఫోటో గ్రాఫర్లు తమ కెమెరాలతో క్లిక్ అనిపిస్తుంటారు. తాజాగా రోజా ఫోటోలు దిగి అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. రోజాను ఒకేసారి 3000 మంది ఫోటోగ్రాఫర్లు..సింగిల్ క్లిక్ తో ఫోటోలు తీసి రాకార్డు సృష్టించారు.
శనివారం విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫీ కార్నివాల్, ఎక్స్ పో లో రోజా సందడి చేశారు. ఎగ్జిబిషన్ ను సందర్శించిన రోజా …అ తర్వాత అక్కడ ఉన్న కెమెరాలను తీసుకొని ఫోటోలు తీశారు.
ఈ సంద్బంగా రోజా తన గతాన్ని తలుచుకొని మురిసిపోయారు. ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో వల్లే సినిమా ఛాన్స్ వచ్చిందని ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగేలా చేసిందని రోజా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 3 వేల మంది ఫోటోగ్రాఫర్లు ఒకేసారి సింగిల్ క్లిక్‌తో రోజాను ఫోటోలు తీసి రికార్డు నమోదు చేశారు. ఒకే క్లిక్ తో 3వేల మంది ఫోటోగ్రాఫర్స్ ఫోటో తీయ్యడం గొప్ప అనుభూతినిచ్చిందని ఈ సందర్భంగా రోజా హర్షం వ్యక్తం చేశారు. ఒకే వేదికపైకి అన్ని ఫొటోగ్రఫీ సంస్థలు రావడం ఆనందంగా ఉందన్నారు.
మెట్రోపాలిటన్ సిటీలకు పరిమితమైన ఫోటోగ్రఫి ఎక్స్‌పోలు ఏపీలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని … క్రియేటివ్ ఎక్స్‌పర్ట్స్‌గా ఫోటో గ్రాఫర్లు, వీడియోగ్రాఫర్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె కితాబిచ్చారు.