వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలి – చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మహా జోరుగా సాగుతున్నాయి. భద్రాచలం ముంపు గ్రామాలపై జగన్, చంద్రబాబు ఒకరిపై ఒకరు తప్పులు తోసుకుంటున్నారు. చంద్రబాబు భద్రాచలంలో పర్యటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాబోయే ఎన్నికలలో జగన్ ఓటుకు మూడువేలు ఇస్తాడని సెటైర్లు వేసారు.
తమ ప్రభుత్వ హయాంలో కరకట్ట కట్టడం వల్ల ఈ వరదకు అడ్డు కట్ట వేయగలిగామని… ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే విలీన మండలాలు ముంపులకు గురైయ్యాయని విమర్శించారు. ప్రస్తుత మంత్రులు దద్దమ్మలని ఇంత వరద వస్తుందని ఊహించలేదంటూ చెప్పడం ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. జగన్ ఎంతో తెలివైన వాడనీ, కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే తిరిగారనీ, అతని నిర్లక్ష్యానికి వెంటనే రాజీనామా చేయాలనీ ఎద్దేవా చేసారు. 25 మంది వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు చిటికెలో పూర్తి చేస్తానని… ముంపు ప్రాంతాల ప్రజల్లో వెలుగులు నింపుతానన్నారు. పోలవరం నిర్వాసితులు వైసీపీకి వ్యతిరేఖంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బాధితులకు ఎప్పుడూ టీడీపీ అండగా ఉంటుందన్నారు. జగన్ సర్కారుకు చిత్తశుద్ది లేదని… ఆంధ్ర ప్రజలకు రాజధాని లేకుండా చేసారని… రైతులంతా ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు.