Andhra PradeshHome Page Slider

మరో 29 మందికి బీఆర్ఎస్ బీఫాంలు

హైదరాబాద్‌: బీఆర్ఎస్ తరఫున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల్లో ఇప్పటివరకు 98 మందికి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫాంలు అందజేశారు. 69 మంది ఆదివారమే స్వీకరించగా.. సోమవారం 29 మంది అందుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో మిగిలిన 21 మందికి కూడా అందజేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 3న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుండగా.., నామినేషన్ల దాఖలుకు 10వ తేదీ వరకు గడువు ఉంది. 9న కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలకు నామినేషన్లు దాఖలు చేస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థులు తమకు అనుకూలమైన రోజున నామినేషన్ దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.