కాంగ్రెస్ పార్టీలోకి 25 మంది ఎమ్మెల్యేలు: ఐలయ్య
టిజి: కాంగ్రెస్ పార్టీలోకి త్వరలోనే 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వస్తారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వెల్లడించారు. బీఆర్ఎస్ఎల్పీ మొత్తం అధికార పార్టీలో విలీనం కాబోతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పనితీరు నచ్చే ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని తెలిపారు. ప్రలోభ పెట్టాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. గడీల పాలనను బద్దలు కొట్టి ప్రజాపాలన అందిస్తున్నామని అన్నారు.

