Home Page SliderNational

2.50 కోట్ల రూపాయల లాటరీ తీసుకునే దారేది

కోట్ల రూపాయల లాటరీ తగిలినా కూడా ఆ దురదృష్టవంతునికి అందే దారి కనబడడం లేదు. పంజాబ్‌లోని ఫాజిల్కా అనే జిల్లాకు చెందిన సాక్ష్ అనే వ్యక్తి పరిస్థితి అలాగే ఉంది. అతనికి లాటరీలో 2.50 కోట్ల రూపాయలు లక్కీడ్రాలో తగిలింది. కానీ అతను చేసిన పొరపాటేంటంటే అతని అడ్రస్, ఫోన్ నెంబర్ ఏదీ రాయలేదు. కేవలం సాక్ష్ అనే రెండక్షరాల పేరును మాత్రమే రాశాడు. దీనితో 249092 టికెట్ నంబరు కలిగిన వ్యక్తి తాను గెలుచుకున్నడబ్బు కోసం రూప్‌చంద్ లాటరీ కంపెనీని సంప్రదించమని, లేదంటే అది నేరుగా ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుందని లాటరీ కంపెనీ ప్రకటించింది. లాటరీ తగిలడం వల్ల అతడు అదృష్టవంతుడో, అందుకునే అవకాశం లేని దురదృష్టవంతుడో వేచి చూడాల్సిందే.