ఏపీలో ఎన్డీఏకు 160 ఎమ్మెల్యేలు, దేశంలో 400 ఎంపీలు:చంద్రబాబు జోస్యం
చిలకలూరిపేటలో ప్రధాని మోదీ సభ తర్వాత గ్రౌండ్ మారిపోతుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజాగళం విజయవంతం కావడంతో, వచ్చే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి అధికారంలోకి రావాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే త్వరలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక పూర్తికాగానే, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని ఆయన యోచిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ చంద్రబాబు ట్విట్టర్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ అంతటా ఎన్డీఏ గెలుపు ప్రతిధ్వనిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఎన్డీఏ గెలుపు ప్రగతిశీల శకం ఆవిర్భావానికి సంకేతమని, దృఢమైన నమ్మకంతో చెబుతున్నానన్నారు. దేశంలో ఎన్డీఏ కూటమికి 400కి పైగా ఎంపీ స్థానాలు, రాష్ట్రంలో 160కి పైగా ఎమ్మెల్యే స్థానాలొస్తాయన్నారు.

