Home Page SliderNational

15 మంది ఖైదీలకు హెచ్ఐవీ.. ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు

ఉత్తరఖండ్ లోని హరిద్వార్ జిల్లా జైలులో 15 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా కొత్తగా జైలుకు వచ్చిన వారికి టెస్ట్ లు చేయగా ఈ విషయం వెల్లడైందని జైలు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ ఆర్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జైలు నిబంధనల ప్రకారం కొత్తగా వచ్చిన ఖైదీలకు సాధారణ ఆరోగ్యం పరీక్షలు నిర్వహిస్తాం. అదే విధంగా హెచ్ఐవీ టెస్ట్ లు కూడా చేస్తాం. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యం శిభిరం నిర్వహించాం. అప్పుడు ఈ విషయం తెలిసింది’ అని అన్నారు. వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక బ్యారాక్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లా జైలులో సుమారు 11 వందల మంది ఖైదీలు ఉన్నారని తెలిపారు.