NationalNews

కేజ్రీవాల్‌ మీటింగ్‌కు 12 మంది ఎమ్మెల్యేలు డుమ్మా

లిక్కర్‌ స్కాం వ్యవహారంపై ఒక్కసారిగా ఢిల్లీ పాలిటిక్స్‌ హీటెక్కాయి. ఆప్‌ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 12 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆ ఎమ్మెల్యేల ఫోన్లు కలవటం లేదని, వారితో మాట్లాడలేకపోయినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ మారేందుకు బీజేపీ పార్టీ తమకు రూ.20 కోట్లు ఆఫర్‌ చేసిందని గతంలో నలుగురు ఆప్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు.

ఆప్‌ ప్రభుత్వంలో 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని.. 40 మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి చీల్చేందకు కుట్ర చేస్తోందని ఆప్‌ ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌ ఆరోపించారు. ఈ రోజు సమావేశానికి 53 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని.. మిగతవారిలో ప్రస్తుతం స్పీకర్‌ విదేశాల్లో ఉన్నారని, మనీస్‌ సిసోడియా హిమచల్‌ ప్రదేశ్‌లో ఉన్నారని భరద్వాజ్‌ తెలిపారు. మిగతా ఎమ్మెల్యేలు తమ చివరి శ్వాస వరకు కేజ్రీవాల్‌ వెంటే ఉంటామని వారు స్పష్టం చేశారన్నారు.