Home Page SliderNational

ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం 12 మంది మృతి

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఒకదానికొకటి ఢీ కొట్టడంతో 12 మంది మృత్యువాత పడ్డారు. 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని దగ్గరలోని బర్హంపూర్ MKCG  ఆసుపత్రిలో చేర్చారు.  వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కటక్‌లోని SCB ఆసుపత్రికి తరలించారు. ఆదివారం అర్థరాత్రి గంజాం జిల్లాలోని దిగపహందిలో ఈ ఘటన జరిగింది. ఒడిశా ముఖ్యమంత్రి ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 3 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ఉచితంగా మంచి వైద్యం చేయించే ఏర్పాటు చేశారు. ఒడిశాలో ఈ మధ్య జరిగిన రెండు రైళ్లు ఢీకొట్టిన ఆక్సిడెంట్ మరిచిపోకముందే బస్సు దుర్ఘటన జరగడం ఎంతో విషాదాన్ని కలిగిస్తోంది.