Home Page SliderNational

ఆ కంపెనీ నుంచి 100 ఇంచుల టీవీ లాంచ్..

ఎలక్ట్రానిక్స్ కంపెనీ అకాయ్ ఇండియా ఇటీవల 75, 100 ఇంచుల గూగుల్ ఓఎస్ టీవీలను లాంచ్ చేసింది. వీటిలో 4కే డిస్ ప్లే అండ్రాయిడ్ 11 ఓఎస్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, ఎంఈఎంసీ టెక్నాలజీ వైడ్ వ్యూయింగ్ యాంగిల్, ఎక్కువ బ్రైట్నెస్, హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి. 75 ఇంచుల టీవీ ధర రూ. లక్ష కాగా, 100 ఇంచుల టీవీ ధర రూ. నాలుగు లక్షలు అని కంపెనీ తెలిపింది. ఈ కొత్త టీవీలు బజాజ్ ఎలక్ట్రానిక్స్ తోపాటు డీలర్లు, పంపిణీదారుల నెట్ వర్క్ ద్వారా అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. రెండు మోడల్స్ పై రెండేళ్ల వారంటీ ఉంటుందని అకాయ్ ప్రకటించింది.