Home Page SliderNational

ముంబై – అమరావతి ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టిన లారీ..

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. బోద్వాడ్ రైల్వే స్టేషన్ వద్ద ముంబై-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను ట్రక్కు ఢీకొట్టింది. భూసావల్ డివిజన్‌లోని భూసావల్ మరియు బద్నేరా సెక్షన్ల మధ్య బోద్వాడ్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం జరిగింది. మూసివేసిన రైల్వే క్రాసింగ్‌ను ట్రక్కు దాటినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ట్రక్కు డ్రైవర్ లేదా ఇతర ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులు ఇబ్బందికి గురయ్యారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి వుంది.

https://twitter.com/ANI/status/1900413956189282620