NationalNews

భారతీయులకు గుడ్ న్యూస్… ఐఫోన్ 14 తయారీ ఇండియాలో

ఐఫోన్ 14‌ను ఇండియాలో తయారు చేయనున్నట్టు యాపిల్ ఇవాళ ప్రకటించింది. ఇండియాలో ఫోన్ తయారు చేయబోతున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. ప్రపంచంలోని పలు దేశాలతో పోల్చుకుంటే ఐఫోన్ 14 ఇండియాలో రేటు ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. దేశీయంగా ఫోన్ తయారు చేస్తే తక్కువ ధరకు అందించొచ్చని కంపెనీ భావిస్తోంది. ప్రపంచంలోని 9 దేశాల్లో ఐఫోన్ 14 ఇండియాలో కంటే తక్కువ ధరకు లభిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఐఫోన్ 14 సుమారుగా 80 వేల వరకు పలుకుతోంది. అంతే కాదు ప్రో మోడల్స్ ధర ఇండియాలో మరో 10 వేలు అధికంగా ఉంది.

ప్రస్తుతానికి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫోన్లను అమ్ముతున్నందున రేట్లు తగ్గే అవకాశం తక్కువనే చెప్పాలి. ఐఫోన్ 14న తమిళనాడు శ్రీపెరంబుదూర్‌లో ఫాక్స్‌కాన్ తయారు చేస్తుంది. సెప్టెంబర్ 7న ఐఫోన్ లాంచ్ చేసిన తర్వాత యాపిల్ ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. ఇండియాలో తయారయ్యే ఫోన్లు దేశీయంగా అందుబాటులో ఉండటంతోపాటు, విదేశాలకు ఎగుమతి చేసేలా వేగంగా తయారు చేయాలని యాపిల్ భావిస్తోంది. యాపిల్ సంస్థకు ఇండియాలో విస్ట్రిన్, ఫాక్సాకాన్, పెగట్రాన్ ముగ్గురు గ్లోబల్ పార్టనర్లతో రూపొందిస్తోంది.

2017లో ఐఫోన్ SEని ఇండియాలో తొలుత యాపిల్ తయారు చేసింది. ప్రస్తుతం ఐఫోన్ 12, 13 కూడా ఇండియాలో తయారు చేస్తున్నారు. ఇండియాలో తయారు చేయడం వల్ల కంపెనీకి ఎన్నో ప్రోత్సహకాలు సైతం లభిస్తున్నాయ్. ప్రస్తుతం చైనా నుంచే 95 శాతం ఐఫోన్లు తయారవుతున్నాయ్. ఇండియాలో కంపెనీలను విస్తరిస్తే తగిన రాయితీలు ఇస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. మోదీ సర్కారు రూపొందించిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌లో ఐఫోన్లను తయారు చేయాలని యాపిల్ భావిస్తోంది.

రానున్న ఐదారేళ్లలో ఇండియాలో $50 బిలియన్ల డాలర్ల విలువైన అంటే సుమారుగా 4 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను ఏటా తయారు చేయాలని ఇండియా కోరుతోంది. మాక్‌బుక్‌లు, ఐప్యాడ్‌లు, ఎయిర్ పాడ్‌లు, వాచెస్‌లను తయారు చేయాలని కోరుతోంది. యాపిల్ తన ఇతర ఉత్పత్తుల కోసం ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రోగ్రామ్‌ను అధ్యయనం చేస్తోంది, అయితే ఇప్పటివరకు ఐఫోన్‌ల కోసం మాత్రమే పెట్టుబడులు పెట్టింది. యాపిల్ ఇండియాలో ప్రస్తుతం 30 వేల కోట్ల రూపాయల రెవిన్యూ సంపాదిస్తోంది. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల అమ్మకాలు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయ్.

సెప్టెంబర్ 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ సంస్థ 365 బిలియన్ డాలర్లు అంటే 28 లక్షల 58 వేల కోట్ల రూపాయలుగా ఉంది. ఇందులో $191 బిలియన్లు అంటే 15 లక్షల 57 వేల కోట్లు iPhoneల నుంచే వస్తున్నాయ్. అయితే సుమారు $67 బిలియన్లు అంటే 5 లక్షల 46 వేల కోట్ల రూపాయలు Macbooks, iPadల నుండి వచ్చాయి. ఎయిర్ పాడ్‌లు, వాచీలు, ఇతర ఉత్పత్తుల ద్వారా మరో $38 బిలియన్ల డాలర్లు అంటే 3 లక్షల 9 వేల కోట్లు వచ్చాయి.