News Alert

ఇకపై వారికి 4% రిజర్వేషన్    

కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఎప్పుడో చట్టం తీసుకువచ్చింది. దీనిని అన్ని శాఖలు విధిగా అమలు చేయాలని సుప్రీం కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలు ఇచ్చి మూడేళ్లు గడిచాక ఏపీ సర్కార్ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందే ఈ రిజర్వేషన్ ప్రక్రియ అమలు చేసి ఉంటే ఎంతో మంది గ్రామ , వార్డు సచివాలయ నియామకాల్లో లబ్ధి పొందేవారమని దివ్యాంగులు వాపోతున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్ల నియమకాన్ని చేపట్టింది. దీని ద్వారా దాదాపు 2.50 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. కానీ ఈ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ ఇవ్వని కారణంగా దాదాపు 10వేల ఉద్యోగాలును కోల్పోయామని వారు  ఆవేదన చెందుతున్నారు. అదే విధంగా గ్రామ , వార్డు సచివాలయ పోస్టుల్లోనూ రిజర్వేషన్ అమలు చేయని కారణంగా లక్షకు పైగా జరిగిన నియామకాల్లో 4 వేల ఉద్యోగాలను కోల్పోయామంటున్నారు. అప్పట్లోనే రిజర్వేషన్ కల్పించినట్టు అయితే ఎంతోమంది ఉద్యోగాలు పొందేవారమని..ఇన్నాళ్లకు అయినా ప్రభుత్వం కళ్లు తెరిచి అమలు చేయడాన్ని వారు స్వాగతిస్తున్నారు.