NationalNews

మంత్రి సన్నిహితురాలి ఇంట్లో 20 కోట్లు స్వాధీనం

Share with

టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యశాఖ మంత్రి పార్థఛటర్జీ అంత్యంత సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తోంది. ఈ తనిఖీల్లో ఏకంగా రూ.20 కోట్ల నగదు పట్టుబడినట్లు ఈడీ వెల్లడించింది.

రాష్ట్రంలోని స్కూల్ సర్వీస్ కమీషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డు రిక్రూట్మ్ంట్ స్కామ్ విచారణలో భాగంగా ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది. అయితే అర్పితా ముఖర్జీ ఇంట్లో ఎక్కడ చూసినా 5 వందలు, 2వేల నోట్ల కట్లలే దర్శనమిచ్చినట్లు ఈడీ అధికారులు తెలిపారు. నగదుతో పాటు 20కి పైగా మొబైల్ ఫోన్‌లు అర్పితా ముఖర్జీ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఛటర్జీతో పాటు విద్యాశాఖ మంత్రి పరేష్ సి అధికారి, ఎమ్యెల్యే మాణిక్ భట్టాచార్య మరికొందరి నివాసాలపై ఈడీ ఏక కాలంలో దాడులు నిర్వహించింది. నేరాన్ని నిరూపించడంలో ఉపయోగపడే పత్రాలతో పాటు డొల్ల కంపెనీల వివరాలు, విదేశీ కరెన్సీ, బంగారం, ఎలక్ట్రానిక్ పరికరాల కుంభకోణంతో సంబంధమున్న వ్యక్తుల వద్ద లభించాయని వెల్లడించారు. పార్ధఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి.