సుప్రీం చీఫ్ జస్టిస్‌గా లలిత్ కుమార్
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ U లలిత్ కుమార్ పదవి బాధ్యత స్వీకారం చేపట్టారు. జస్టిస్ లలిత్ సుప్రీం కోర్టు బార్ కౌన్సిల్ నుంచి నేరుగా ఎంపిక కాబడిన రెండో ప్రధాన న్యాయమూర్తి. గతంలో ఈవిధంగా ఎస్ఎం సిక్రీ భారత 13 వ న్యాయమూర్తి గా సేవలందించారు. జస్టిస్ లలిత్ కుమార్ 8, నవంబర్ 2022 లో పదవి విరమణ చేస్తారు. పదవి కాలం 74 రోజులు మాత్రమే. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాకా ముందు క్రిమినల్ కేసుల్లో ప్రఖ్యాత న్యాయవాదిగా ఆయన సేవలందించారు. 2011లో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఆడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా 2G స్కామ్ నందు ప్రభుత్వం తరపున వాదించారు.
ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం అని తేల్చిన బెంచ్‌లోనూ, అలాగే పద్మనాభ స్వామి ఆలయం కేసులో, బాంబే హైకోర్టు పొక్సో కేసులో ఇచ్చిన తీర్పులో ఆయన వాదనలు ఎంతో ప్రాచూర్యం పొందాయ్. ముంబై జడ్జిని రాజీనామా కోరిన ధర్మాసనంలో లలిత్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. లలిత్ కుమార్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వారు. ఆయన తండ్రి బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా సేవలందించారు.


