ఢిల్లీలో బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తూ.. వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన పాదయాత్రకు బ్రేక్ పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ ఈ రోజు ఢిల్లీలో జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఆయన కాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు.ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఢిల్లీలో ఉన్న బీజేపీ అగ్రనేతలను కలిసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఆయన ఈ నెల 21న జరిగే మునుగోడు సభ,పాద యాత్ర ముగింపు సభలకు బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా,జేపీ నడ్డాలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో బీజేపీకి ఎంతో కీలకమైన మునుగోడు ఉపఎన్నిక గురించి బండి సంజయ్ బీజేపీ నేతలు అయిన అమిత్‌షా,జేపీ నడ్డాలతో చర్చించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బండి సంజయ్‌తో పాటు దాసోజు శ్రవణ్ కూడా ఢిల్లీకి పయనమయ్యారు.