InternationalNews

ఉద్యోగులను తొలగించిన టెక్‌ దిగ్గజం యాపిల్‌

Share with

కరోనా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ప్రపంచమంతా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి చిన్న దేశాలైతే విదేశీ అప్పులు కట్టలేక చేతులెత్తేశాయి. అగ్రదేశం అమెరికాలోనూ ఆర్థిక సంక్షోభ కారుమేఘాలు అలుముకున్నాయి. ఆ సంక్షోభం ప్రభావం అక్కడి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలపై పడింది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రముఖ టెక్‌ కంపెనీలు ఖర్చుల తగ్గింపు, ఉద్యోగాల కోతపై దృష్టి పెట్టాయి.

ప్రపంచ అత్యుత్తమ ఐటీ కంపెనీల్లో ఒకటైన యాపిల్‌ 100 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. అయితే.. పూర్తి స్థాయి ఉద్యోగులను మాత్రం కొనసాగిస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. తొలగించిన ఉద్యోగులకు రెండు వారాల జీతం, వైద్య ప్రయోజనాలు అందిస్తామని పేర్కొన్నది. తాము ఖర్చు తగ్గింపుపై దృష్టి పెట్టామని, ఉద్యోగుల్లో కోత తప్పదని యాపిల్‌ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ గత నెలలోనే చెప్పారు.