అ వివరాలు తప్పయితే ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలు బయటపెట్టాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి చెప్పిన వివరాలు తప్పయితే ప్రభుత్వం తన వద్ద ఉన్న వివరాలు బయటపెట్టాలని కౌంటర్ ఇచ్చారు. పురంధరేశ్వరి ఏపీ ప్రభుత్వ అప్పులపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ మాట్లాడిన మాటలకు జవాబుగా ఇలా ప్రతివిమర్శ చేశారు విష్ణు వర్థన్ రెడ్డి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంథరేశ్వరి గారు చాలా డీటైల్డ్ ఏపీ ప్రభుత్వ అక్రమ అప్పుల గురించి వివరాలు మీడియా ముందుబయట పెట్టారన్నారు. అ వివరాలు తప్పయితే ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలు బయటపెట్టాలని సవాల్ చేశారు. మా పార్టీ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేదంటే బీజేపి చెప్పింది నిజమనే ఒప్పుకున్నట్లేనా ? అని ప్రశ్నించారు. గత ఐదేళ్ల టిడిపి పాలనలో 2,65,365 కోట్లు అప్పు చేశారు.మీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జులై వరకు నాలుగేళ్లల్లో 7,14,631 కోట్లు అప్పు తెచ్చారు, ఇది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు విష్ణువర్థన్ రెడ్డి.