మీ భూమి… మీ హక్కు: సీఎం జగన్
కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఈ రోజు సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఏపీలో నిషేదిత భూముల జాబితా నుంచి షరతులు ఉన్న పట్టా భూములు తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22A(1) కింద ఉన్న నిషేదిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూములకు సీఎం జగన్ క్లియరెన్స్ ప్రకటించారు. కాగా ఈ పత్రాలను సీఎం జగన్ రైతులకు అందించారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 35,600 ఎకరాలకు చెందిన 22 వేలమంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని సీఎం వెల్లడించారు. ఈ క్లియరెన్స్ పత్రాలు ఇవ్వడం వల్ల..భూములపై రైతులకు సర్వ హక్కులు కల్పిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

