జూన్‌లో యాదాద్రీశుడి ఆదాయం పెరిగింది
టిజి: యాదాద్రి పుణ్యక్షేత్రానికి భక్తుల రాక పెరిగిందని, ఆదాయమూ అదేస్థాయిలో వస్తోందని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈఓ భాస్కర్ రావు తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో దేవస్థానంలోని వివిధ విభాగాల ద్వారా రూ.23.91 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. గతేడాది ఇదే జూన్‌లో వచ్చిన ఆదాయం రూ.16.36 కోట్లతో పోలిస్తే ఇది రూ.7.55 కోట్లు అధికమని ఈఓ ఒక ప్రకటనలో తెలిపారు.

