పవన్‌కు మహిళా కమీషన్ వార్నింగ్ నోటీసులు
ఏపీ మహిళా కమీషన్ పవన్ కళ్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. వాలంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా తీసుకుంది మహిళా కమీషన్. వాలంటీర్ల వల్ల మహిళలు మిస్సింగ్ అవుతున్నారని, మహిళా ట్రాఫికింగ్ ఎక్కువ అవుతోందని పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించమని సవాల్ విసిరారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. డైలాగ్స్ కొట్టి వెళ్లడం పవన్‌కు అలవాటయిపోయిందని, ఏకంగా 33 వేలమంది మహిళలు మిస్సింగ్ అంటూ పవన్ మాట్లాడిన మాటలను మహిళా సంఘాలు, మహిళా వాలంటీర్లు చాలా తీవ్రంగా తీసుకుంటున్నాయని, దేశానికే ఆదర్శంగా నిలిచిన వాలంటీర్ వ్యవస్థ మీద విషం కక్కుతున్నారని, ఆంధ్రప్రదేశ్‌పై కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. దీనిని వదిలిపెట్టేది లేదని మండిపెట్టారు. కాకి లెక్కలతో ఇలాంటి రూమర్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళలు మిస్ కావడం లేదా అంటూ ధ్వజమెత్తారు. మహిళా కమీషన్ దృష్టికి రాకుండా ఒంటరి మహిళలు మిస్ అవుతున్నారన్న విషయం పవన్ కళ్యాణ్‌కు ఏ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారో వారి పేర్లు చెప్పాలంటూ సవాల్ చేశారు. లేని పోని పుకార్లతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నంలో మహిళలను అవమానపరిస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంగా వివరణ కోరుతూ మహిళా కమీషన్ పవన్‌కళ్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. కాగా ఏలూరులో పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్లు ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, వ్యతిరేక నినాదాలు చేశారు.

