Home Page SliderNews

విరాట్ కోహ్లీతో ఐటెమ్ నెంబర్ చేస్తా..!

విరాల్ కోహ్లీ మైదానంలో ఎప్పుడూ వినోదం పంచుతూ అభిమానులను అలరిస్తుంటాడు. కోహ్లీ బ్యాటింగ్ చూడటమంటే అభిమానులకు వేరే చెప్పనక్కర్లేదు. టఫ్ టైమ్‌లోనూ స్కోర్ చేయడానికి కోహ్లీ ప్రయత్నిస్తాడు. ఇటీవల కొన్ని రోజుల తర్వాత పూర్తి ఫామ్‌లో వచ్చాడు కోహ్లీ. 2022 ఆసియా కప్ నుండి దుమ్మురేపుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో కూడా, ఇప్పటివరకు మూడు గేమ్‌లలో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. కోహ్లి తన డ్యాన్స్ స్కిల్స్‌తో కూడా సత్తా చాటుతున్నాడు. డ్యాన్స్ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో షారుఖ్‌తో కలిసి పఠాన్‌ సాంగ్‌‌కు డ్యాన్స్ చేశాడు. ఇప్పుడు, ‘క్రిటిక్ అండ్ ట్రేడ్ అనలిస్ట్’ కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. కోహ్లీ కోసం ఒక ఉల్లాసకరమైన ప్రతిపాదన చేశాడు.

2020 IPL నుండి కోహ్లీ పాత డ్యాన్స్ వీడియోను రీట్వీట్ చేస్తూ, KRK ఇలా రాశాడు: “కోహ్లీ డ్యాన్స్ స్కిల్స్‌ ఎంతో ఆకట్టుకుంటున్నాయి, అందుకే నా చిత్రం #Deshdrohi2లో కోహ్లీకి ఐటెమ్ నంబర్‌ చేయాలని కోరుకుంటానన్నాడు. దేశద్రోహి (2008), ఏక్ విలన్ (2014) వంటి చిత్రాలలో కేఆర్కే నటించాడు. పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నాడు. విరాట్ కోహ్లి ఇటీవల లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన 46వ హాఫ్ సెంచరీని సాధించాడు. RCB మాజీ కెప్టెన్ 35 బంతుల్లో 50 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఈ సీజన్‌లో రెండో అర్ధ సెంచరీని నమోదు చేశాడు.

అయితే, కోహ్లీ 42 నుండి 50కి చేరుకోవడానికి 10 బంతులు పట్టడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమన్ డౌల్‌తో కోహ్లీ బ్యాటింగ్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కోహ్లీ బ్యాటింగ్ విధానం సరిగాలేదన్న డౌల్, కీలక మైలురాయి గురించి ఆందోళన చెందుతున్నాడంటూ కామెంట్ చేశాడు. కోహ్లీ రైలు బండి లాగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడని… చాలా షాట్లను సుత్తి, పట్టకర్రను ఉపయోగించి ఆడుతున్నట్టుగా అన్పిస్తోందన్నాడు. 42 నుండి 50 వరకు, 10 బంతులు ఆడటంపై విమర్శలు గుప్పించాడు. ఐపీఎల్ లాంటి గేమ్‌లో ఇలా ఆడటం తగదన్నాడు. వికెట్లు ఇంకా ఉన్నప్పుడు దాటిగా ఆడాల్సి ఉందన్నాడు. డౌల్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ విరుచుకుపడ్డాడు. కోహ్లీపై వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. అవి చెత్త మాటలను తేల్చేశాడు.