Home Page SliderInternationalTrending Today

‘ఆదిపురుష్‌’పై సోషల్‌మీడియా ఏమంటోంది?

ఈరోజు ప్రపంచవ్యాప్తంగా  9 వేల స్క్రీన్స్‌లో రిలీజైన భారీ విజువల్ వండర్ ఆదిపురుష్ చిత్రంపై అంచనాలతో పాటు అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ సోషల్ ఫ్లాట్‌ఫామ్ ట్విటర్‌లో టాక్ ఏంటంటే ఈ చిత్రం ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ అంత బాగోలేదని కొందరు, సినిమా మొత్తంగా అదిరిందని కొందరు, ప్రభాస్ అభిమానులు మాత్రమే చూడగలరని కొందరు ట్వీట్స్ పెడుతున్నారు.

ఇక ఫేస్‌బుక్‌లో అయితే జోకులు కూడా పేలుతున్నాయి. ప్రభాస్ అవతారం రాముడిలా కాక ఏసుప్రభులా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రాములోరి వేషంలో ఏసుప్రభు వచ్చాడంటూ నవ్వుకుంటున్నారు. ఇంకొందరు హనుమంతుడి సీటుపై వ్యాఖ్యానిస్తూ ఆంజనేయుడు ఆ సీటు వదిలి, ఇది రామాయణం కాదు మీరే చూసుకోడంటూ సినిమా వదిలి పారి పోతాడని కామెంట్లు పెడుతున్నారు.  కానీ చాలామంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ఆదిపురుష్ చిత్రం మొత్తంగా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుందనే చెప్పాలి.