Andhra PradeshHome Page Slider

ఎన్నికల్లో స్వీప్ చేస్తాం… కూటమి సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ -చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో మూడు పార్టీల విజయం తధ్యమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మిత్రపక్షాలైన జనసేన బీజేపీతో కలిసి ఎన్నికలను స్వీప్ చేస్తామన్నారు. మూడు పార్టీలు కలిసి సభ నిర్వహిస్తామని పార్టీ నేతలకు టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు చెప్పారు. టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభకు ప్రధాని మోదీ వస్తారని చంద్రబాబు చెప్పారు. మోదీ సభ పాల్గొనే సభకు అనువైన ప్రదేశం ఎంపిక చేయాలని చంద్రబాబు నేతలకు సూచించారు. బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. చాలా రోజులుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. పొత్తు కుదిరిందని ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోరుకునే మైనార్టీలు కూటమికే ఓటేస్తారన్నారు చంద్రబాబు. మూడు పార్టీలు కలిసే ఎన్నికల ప్రచారం చేస్తాయన్నారు. ఏ పార్టీ ఎక్కడ్నుంచి పోటీ చేస్తుంటే రెండ్రోజుల్లో వెల్లడిస్తామన్నారు.