home page sliderHome Page SliderTelangana

ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నాం..

ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నామని మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం మావోయిస్టు పార్టీ అగ్రనేత జగన్ పేరిట లేఖ విడుదలైంది. ‘‘తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు, మెజార్టీ రాజకీయ పార్టీలు మావోయిస్ట్ పార్టీకి, ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరగాలనే డిమాండ్‌ను ప్రముఖంగా చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని.. మా నుండి 6 నెలల వరకు కాల్పుల విరమణను పాటిస్తున్నామని ప్రకటించుచున్నాము.” అని లేఖలో పేర్కొన్నారు.