Andhra PradeshNews

గుంటూరు జీజీహెచ్ ఘటనపై విడదల రజిని ఆగ్రహం

గుంటూరు జీజీహెచ్‌లో బాలుడి అదృశ్యం కలకలం రేపుతుంది.  వైద్యం నిమిత్తం బాలుడు తల్లిదండ్రులతో కలిసి గుంటూరు జీజీహెచ్‌కు వచ్చాడు. వచ్చిన కొంత సేపటికే బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు హస్పటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. బాలుడి అదృశ్యం ఘటనలో శాఖాపరమైన దర్యాప్తు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక పోలీసు బృందాలతో గాలిస్తున్నట్లు విడదల రజిని వెల్లడించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేస్తామని విడదల రజిని తెలిపారు.