పెంపుడు కుక్క మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన కూడా…
కుక్క పట్ల మనిషికున్న భావోద్వేగం ఆత్మహత్యకు ప్రేరేపించింది. సాధారణంగా మనషుల పట్ల కుక్కలు విశ్వాసాన్ని చూపుతుంటాయి.కానీ కుక్కకు మించిన విశ్వాసాన్ని మనిషి చూపించాడు.అదే అతని పాలిట మృత్యు శాపమైంది.బెంగళూరులో రాజశేఖర్ అనే వ్యక్తి జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు.అది అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది.శునకాన్ని ఖననం చేసి ఇంటికి వచ్చాడు. అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుక్క చనిపోయిందని తీవ్ర మనస్తాపానికి గురైన యజమాని రాజశేఖర్ …కుక్క మెడకు ఉన్న చైన్ తోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కొత్త సంవత్సరంలో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

