Home Page SliderNational

మర్డర్ లో ట్విస్ట్.. అంత్యక్రియలు తర్వాత తిరిగొచ్చిన మహిళ

ఓ మహిళ హత్యకి గురైందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో నలుగురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కోర్టు తీర్పుతో 18 నెలలుగా నలుగురు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మండ్సర్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే.. మహిళ హత్య మిస్టరిలో ట్విస్ట్ రావడంతో అందరూ షాక్ గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. 18 నెలల క్రితం లలితా బాయి అనే మహిళ కనిపించకుండా పోయింది. దీంతో లలితా బాయి తండ్రి రమేష్ బాంచాడా పోలిసులకు ఫిర్యాదు చేశాడు. మార్చురీలో ఉన్న ఓ మృతదేహానికి చేతి పై టాటూ ఉండడంతో మృతదేహం తమ కూతురుదే అని తల్లిదండ్రులు భావించారు. మృతదేహం గుర్తించడంలో పొరబడడంతో కూతురు చనిపోయింది అని మృతదేహం తీసుకెళ్లి వెంటనే అంత్యక్రియలు చేశారు కుటుంబసభ్యులు. అయితే.. 18 నెలల తరువాత సడెన్ గా ఎంట్రీ ఇవ్వడంతో లలితా బాయిను చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. లలితా బాయిను పోలీసులు ప్రశ్నించగా తెలిసిన వ్యక్తి తనను మోసం చేసి రూ.5 లక్షలకు అమ్మేశాడని, ఇన్ని రోజులు బందీగా ఉండి, అవకాశం దొరకడంతో వారి చెర నుంచి బయటపడి ఇంటికి తిరిగొచ్చనని వివరించింది. ఈ పరిణామంతో చేయని హత్యకు, నలుగురిని అరెస్టు చేసి జైలుకు పంపారని పోలీసుల పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.