Home Page SliderNational

హేమ కమిటీ రిపోర్ట్‌పై అగ్ర హీరోయిన్ సమంత స్పందన

మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్న హేమ కమిటీ రిపోర్ట్‌పై అగ్ర హీరోయిన్ సమంత స్పందించారు. ‘కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) చొరవ వల్లే హేమ కమిటీ రిపోర్ట్ చేశారు. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు బహిర్గతమయ్యాయి. సురక్షితమైన, గౌరవప్రదమైన పనిచేసే ప్రదేశాల కోసం ఎన్నో ఏళ్లుగా మహిళలు పోరాటం చేస్తున్నా ఫలితం శూన్యం. ఇప్పటికైనా ఆ విషయాలపై నిర్ణయం తీసుకునే టైమ్ వచ్చింది, ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలను సమంత కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి సినిమా యాక్టర్ల కష్టాలను తెలుసుకోవాలి, వాటికి పరిష్కారాలను వెంటనే చేపట్టాలని సినిమా యాక్టర్ సమంత కోరారు.