అమిత్‌షాతో భేటీ కానున్న టాలీవుడ్ హీరో
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో బిజీ బిజీగా గడపనున్నారు. అమిత్‌షాతో టాలీవుడ్ హీరో జూ. ఎన్టీఆర్ భేటీ కానున్నారు. మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. మునుగోడు సభ అనంతరం తిరుగు పయనంలో శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్ట సమీపంలో ఉన్న నోవాటెల్ హోటల్‌లో సాయంత్రం ఆయనతో జూ. ఎన్టీఆర్ సమావేశం కానున్నారు. అమిత్‌షా-ఎన్టీఆర్ భేటిని బీజేపీ వర్గాలు ధృవీకరించాయి. ఏయే అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకుంటారు? రాజకీయ పరమైన కారణాలా? ఇతర అంశాలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమిత్-ఎన్టీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

