Andhra Pradesh

ప్రభాస్ మూవీలో ముగ్గురు హీరోయిన్లు

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ పనులు ప్రారంభమయ్యాయి. కాాగా ఇప్పుడు ఈ మూవీ రెగ్యూలర్ ఘాటింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ దీనికి సంబధించి హీరోయిన్లను వెతికే బాటలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బీజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమాకి కేవలం కొన్ని కాల్షీట్లు మాత్రమే ఇచ్చారట. దీంతో మారుతి కూడా సినిమాని త్వరగా పట్టలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్ , మారుతీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి డీలక్స్ రాజా అనే టైటిల్ కూడా అనుకున్నట్టు వార్తలు వినిపిస్తోన్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు ఇద్దరు హీరోయిన్లను సెలక్ట్ చేయగా మరో హిరోయిన్ కోసం చిత్రబృదం వెతుకులాటలో ఉన్నట్టు సమాచారం. ప్రభాస్‌తో సినిమా గురించి నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై మారుతి స్పందించారు. “నా భవిష్యత్ ప్రాజెక్ట్ , టైటిల్ , బ్యానర్ , మ్యూజిక్ డైరెక్టర్ వంటి వాటి గురించి రూమర్లు వస్తున్నాయి. కాలమే వాటికి సమాధానం చెబుతుంది” అంటూ రాసుకొచ్చారు.