‘ఇది నా ఫెయిల్యూర్’..ముఖ్యమంత్రి క్షమాపణలు
అసెంబ్లీ వేదికగా జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా క్షమాపణలు చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఉద్వేగానికి లోనయ్యారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా పర్యాటకులు వచ్చే జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి వచ్చిన అతిథులను కాపాడడంలో ఫెయిల్ అయ్యానని, ఈ దాడిలో మరణించిన వారి సాక్షిగా తాను కశ్మీర్‌కు రాష్ట్ర హోదా డిమాండ్ చేయనని పేర్కొన్నారు. రాష్ట్ర హోదా అంశంపై మాట్లాడుతూ, “పహల్గామ్ ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకుని నేను రాష్ట్ర హోదాను డిమాండ్ చేయాలి? నా రాజకీయాలు అంత చౌకబారువి కావు. మేము గతంలో రాష్ట్ర హోదా అడిగాం. కానీ, 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఈ సమయంలో, దానిని కారణంగా చూపి రాష్ట్ర హోదా ఇవ్వండని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు” అని ఒమర్ పేర్కొన్నారు. మేము మిలిటెన్సీని తుపాకులతో అదుపు చేయగలం. కానీ దాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే మాకు ప్రజల మద్దతు కచ్చితంగా అవసరం. ఈ ఉద్యమానికి హాని కలిగించేలా ఎవరూ మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు” అని ఆయన అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. పహల్గామ్‌లోని బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి జరగడం గత 21 ఏళ్లలో ఇదే మొదటిసారి. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణ చెప్పాలో కూడా తెలియడం లేదు” అంటూ విచారం వ్యక్తం చేశారు.
Breaking news: బాడీ కెమెరాలతో వీడియోలు తీసిన టెర్రరిస్టులు

