‘మామీద పడి ఏడుస్తున్నారు’..మంత్రిపై కేటీఆర్ కామెంట్స్
తమకు సంబంధం లేని విషయాలకు మమ్మల్ని బాధ్యులను చేయాలని మంత్రి కొండా సురేఖ అనుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. మంత్రి సురేఖపై ట్రోలింగ్ విషయం అసలు మాకు సంబంధం లేదని, అనవసరంగా మామీద పడి ఏడుస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంత్రి సురేఖ తానే ఈ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టినట్లు ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయించానని గతంలో నాపై అభాండాలు వేశారు. నాకు మాత్రం కుటుంబం, భార్యా,పిల్లలు లేరనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు. మా ప్రశ్నలకు జవాబులు చెప్పడం కాంగ్రెస్ వారి వల్ల కాలేదు. అందుకే దాడులకు పాల్పడుతోంది. రేవు ఎల్బీ నగర్లో పర్యటిస్తాను నన్ను ఎవరు ఆపగలరో చూస్తాను? అంటూ మీడియాతో మాట్లాడారు. మూసీ నది విషయంలో రెండు రోజుల్లో ప్రెజెంటేషన్ ఇస్తాను అన్నారు. మరోపక్క కొండా సురేఖ ఇప్పటికే ఈ ట్రోలింగ్ వ్యవహారంపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. తెలంగాణలో 3 అకౌంట్లు, దుబాయ్ నుండి 3 అకౌంట్ల ద్వారా ట్రోలింగ్ చేశారన్నారు. ఐదేళ్లు బీఆర్ఎస్ పార్టీలో కూడా పనిచేేశానని, నావ్యక్తిత్వం అందరికీ తెలుసని పేర్కొన్నారు. విలువలు దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


 
							 
							