నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది-ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ
ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా లేఖను చంద్రబాబు జడ్జికి పంపించారు. జైల్లో తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. తన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని ఆయన వివరించారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ జడ్జికి చంద్రబాబు 3 పేజీల లేఖ రాశారు. ఈనెల 25న చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా ఫోటోలు తీశారన్నారు. ప్రతిష్ట దెబ్బతీసేందుకు వీడియో ఫుటేజీ రిలీజ్ చేశారని లేఖలో చంద్రబాబు విమర్శించారు. కుట్రకు సంబంధించిన లేఖ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి కూడా వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఐతే లేఖపై పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు.

